శ్రీకాకుళం జిల్లాలో...
శ్రీకాకుళం జిల్లా వంగర మండలం గీతనాపల్లి గ్రామంలో పేదలకు నిత్యవసర వస్తువులను పంపిణీ చేపట్టారు. కరోనా వైరస్ నేపథ్యంలో లాక్ డౌన్ లో ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రజలకు వంగర మండలం, గీతనాపల్లి గ్రామంలో మాజీ సర్పంచ్ నెయగాపుల శివరామ కృష్ణ ఆధ్వర్యంలో గ్రామంలో 250పేద కుటుంబాలకు ఉత్తరావెల్లి బ్రదర్స్ - ఉత్తరావెల్లి గణేష్ బెనర్జీ, సురేష్ ముఖర్జీ, సప్తగిరి ఛటర్జీ ఆర్ధిక సహాయంతో నిత్యావసర వస్తువులు, కూరగాయలు పంపిణీ చేశారు.
విశాఖ జిల్లాలో...
విశాఖ జిల్లా చోడవరంలో కోవిడ్-19 ను దృష్టిలో పెట్టుకుని ఉపాధి కూలీలకు శానిటైజర్లు, సబ్బులను ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ అందజేశారు. వీటితో పాటు వైఎస్ఆర్ బీమా పథకం ద్వారా అయిదు కుటుంబాలకు చెందిన నామినీలకు రూ.11.30ల చెక్కు లను ఎమ్మెల్యే స్థానిక ఎంపీడీవో కార్యాలయ అవరణలో పంపిణీ చేశారు. తహశీల్దార్ రవికుమార్, ఎంపీడీవో శ్యామ్, ఆదినారాయణ(వెలుగు), గోవింద(ఉపాధి), వైకాపా జిల్లా ప్రధాన కార్యదర్శి ఏడువాక సత్యారావు, మండల పార్టీ అధ్యక్షుడు పల్లా నర్సింగరావు, మారిశెట్టి శ్రీ కాంత్, ఓరుగంటి నెహ్రు బాబు పాల్గొన్నారు.
ప్రకాశం జిల్లాలో...
ప్రకాశం జిల్లా సంతమాగులూరు మండలం ఏల్చూరు గ్రామానికి చెందిన వికలాంగుల సంఘం, మరియు ఏల్చూరు యువకుల ఆధ్వర్యంలో అద్దంకి నుంచి నార్కెట్పల్లి రాష్ట్ర రహదారిపై వెళ్లే సుమారు 200 మంది వాహన చోదకులకు భోజనాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో జూటూరి రామయ్య, వల్లెం వెంకట్రావు, నక్క కొండలు పాల్గొన్నారు.
ప్రకాశం జిల్లా చీరాలలో విధులు నిర్వహిస్తున్న పారిశుద్ధ్య కార్మికులకు బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర మహిళా విభాగం నేతలు నిత్యావసర వస్తువులు, కోడిగుడ్లు పంపిణీ చేశారు. పేరాలలోని ఐదవ వార్దు లో బీసీ సంక్షేమ సంఘ రాష్ట్ర మహిళా విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ సూరగాని లక్ష్మి , నరసింహారావు దంపతులు విధులు నిర్వర్తిస్తున్న పారిశుద్ధ్య కార్మికులకు నిత్యావసర సరకులను పంపిణీ చేశారు.