ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

రవాణా, పర్యటక రంగాల కలయికగా అభివృద్ధి ప్రణాళిక - సభాపతి తమ్మినేని సీతారాం వార్తలు

ఉత్తరాంధ్ర ప్రాంత అభివృద్ధికి మాస్టర్‌ప్లాన్‌ దోహదపడుతుందని... సభాపతి తమ్మినేని సీతారాం పేర్కొన్నారు. అభివృద్ధికి అవకాశం ఉన్న అంశాలన్ని ప్రణాళికలో పొందుపరచాలని అధికారులకు సూచించారు.

masterplan
masterplan

By

Published : Nov 28, 2019, 4:37 PM IST

రవాణా, పర్యటక రంగాల కలయికగా అభివృద్ధి ప్రణాళిక

శ్రీకాకుళం జిల్లా అభివృద్ధికి ప్రణాళిక రూపొందించాలని... సభాపతి తమ్మినేని సీతారాం అన్నారు. విశాఖ మెట్రోపాలిటిన్‌ ప్రాంతీయ అభివృద్ధి ప్రాధికార సంస్థ(వీఎంఆర్‌డీఏ) ఆధ్వర్యంలో దృక్పథ ప్రణాళికపై... బుధవారం స్థానిక కలెక్టర్‌ కార్యాలయంలో సదస్సు నిర్వహించారు. అభివృద్ధికి అవకాశం ఉన్న అంశాలన్నీ ప్రణాళికలో పొందుపర్చాలని సభాపతి అధికారులకు సూచించారు. రవాణా, పర్యటక రంగాలను అభివృద్ధి చేయాలన్నారు. అనంతరం వీఎంఆర్‌డీఏ ఛైర్మన్‌ ద్రోణంరాజు శ్రీనివాసరావు మాట్లాడారు. దృక్పథ ప్రణాళిక జనవరి నాటికి, మాస్టర్‌ ప్రణాళిక జూన్‌ నాటికి తయారుచేసేందుకు చర్యలు చేపడుతున్నట్లు వివరించారు.

ABOUT THE AUTHOR

...view details