రాష్ట్ర ప్రభుత్వం మహిళల భద్రతకు అధిక ప్రాధాన్యత ఇస్తుందని డీఐజీ ఎల్.కె.వి. రంగారావు అన్నారు. మహిళల భద్రతపై దిశా యాప్ ద్వారా అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నామని తెలిపారు. ఈ యాప్‌లో ఎస్ఓఎస్ ఓపెన్ చేసిన తర్వాత మొబైల్ ఫోను ఐదు సార్లు షేక్ చేస్తే నేరుగా పోలీస్ కంట్రోల్ రూమ్‌కు కాల్ వస్తుందని వివరించారు. మొబైల్ ట్రాక్ ద్వారా సంఘటనా స్థలానికి చేరుకుని భద్రత కల్పిస్తున్నామని పేర్కొన్నారు. దిశా యాప్‌ను ముమ్మరంగా ప్రచారం చేయాలని సిబ్బందికి ఆదేశించారు. జిల్లాలో ఈ యాప్‌ను ఇప్పటి వరకు 34 వేల మంది డౌన్లోడ్ చేసుకున్నారని శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలం సర్కిల్ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో తెలిపారు.
'మహిళల భద్రతకు అధిక ప్రాధాన్యం' - srikakulam latest updates
మహిళల భద్రతకు రాష్ట్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందని డీఐజీ ఎల్.కె.వి. రంగారావు అన్నారు. శ్రీకాకుళం జిల్లా రణస్థలం సర్కిల్ కార్యాలయంలో మట్లాడిన ఆయన..కర్ఫ్యూను ప్రతి ఒక్కరూ పాటించాలని ఆదేశించారు. కరోనా సెకండ్ వేవ్‌లో 12 మంది చెందినట్లు తెలిపిన డీఐజీ..థర్డ్ వేవ్‌లో జాగ్రత్తగా ఉండాలని సూచించారు.
కర్ఫ్యూను ప్రతి ఒక్కరూ పాటించాలని ఆదేశించారు. కరోనా సెకండ్ వెవ్ లో 12 మంది పోలీసులు మృతి చెందారని తెలిపారు. థర్డ్ వేవ్‌లో చాలా జాగ్రత్తగా ఉండాలని పేర్కొన్నారు. జిల్లాలో మార్చి నుంచి ఇప్పటివరకు కరోనా నిబంధనలు పాటించని వారిపై 84,284 కేసులు నమోదు చేశామని తెలిపారు. ఈ కేసులకు సంబంధించి అపరాధ రుసుము రూ.65 లక్షలు విధించామన్నారు. దీంతో పాటు కర్ఫ్యూ నిబంధనలను పాటించని వారిపై 45 వేల కేసులు నమోదు చేశామన్నారు. జిల్లాలో ఇప్పటివరకు రూ.2.48 కోట్ల వరకు అపరాధ రుసుము విధించామన్నారు. ప్రజలు జాగ్రత్తలు పాటించడంతోనే కరోనా నివారణ సాధ్యం అవుతుందని అన్నారు. మత్తు పదార్ధాలకు బానిసలు కావద్దని పిలుపునిచ్చారు.
ఇదీ చదవండి: