ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కాలుష్య రహిత భోగి.. మురపాక గ్రామస్థుల వినూత్న ఆలోచన - శ్రీకాకుళం జిల్లా వార్తలు

అంతరించిపోతున్న సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుకోవాలని ఆ గ్రామస్థులు భావించారు. సనాతన భారతీయ సంస్కృతిని.. వినూత్న పద్ధతిలో తెలియజేసేందుకు సిద్ధమయ్యారు. అందరూ ఇష్టంగా జరుపుకొనే భోగి సంబరాలను కాలుష్య రహితంగా చేసేందుకు శ్రీకారం చుట్టారు. ''లక్ష ఒక్క" పిడకలను తయారు చేసి హిందూ ధర్మాన్ని, విశిష్టతను చాటి చెబుతున్నారు సిక్కోలు వాసులు.

different bogie
different bogie

By

Published : Jan 8, 2021, 7:16 AM IST

కాలుష్య రహిత భోగి.. మురపాక గ్రామస్థుల వినూత్న ఆలోచన

తెలుగులోగిళ్లలో సంక్రాంతికి పండుగకు చాలా విశిష్ఠత ఉంది.పండుగ వచ్చిందంటే చాలు... వీధి వీధిలోనూ భోగి మంటల సందడి ఉంటుంది. కానీ ప్రస్తుతం ఆ సంప్రదాయం మరుగున పడే పరిస్థితి ఏర్పడుతోంది. అందుకే ఆచార వ్యవహారాలను కాపాడేందుకు లావేరు మండలం మురపాక గ్రామస్థులు సంకల్పించారు.ఈ ఏడాది భోగి పండుగను వినూత్నంగా చేపట్టాలని నిర్ణయించారు. ప్రతి ఇంటి నుంచి 301 పిడకలను ఇవ్వాలని సూచించారు. అధికంగా పిడకలు తయారు చేసిన వారికి బహుమతులు ప్రకటించడంతో గ్రామస్థులు మరింత ఉత్సాహంగా పిడకలు తయారు చేశారు.

గ్రామంలో చేపట్టిన కార్యక్రమానికి మంచి స్పందన లభించిందని గ్రామపెద్దలు తెలిపారు. కాలుష్య రహితంగా భోగి పండుగ చేయాలనే ఉద్దేశంతో పిడకలు తయారు చేశామని గ్రామస్థులంటున్నారు. సంస్కృతి, సంప్రదాయాలను కాపాడేందుకు గ్రామస్థులు చేసిన ఆలోచనను అందరూ మెచ్చుకుంటూ.... అసలైన భోగి ఇదే కాదా అని అంటున్నారు.

ఇదీ చదవండి:కిడ్నాప్​ కేసు : భూమి ధర పెరిగింది.. గుడ్​విల్ కోసమే బెదిరింపులు!

ABOUT THE AUTHOR

...view details