ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

రేషన్​ కందిపప్పు తూకంలో అవకతవకలు.. - కోటపాడులో రేషన్ కందిపప్పు వార్తలు

రేషన్ ద్వారా పంపిణీ చేసే కంది పప్పు తక్కవగా వస్తుండడంతో శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాళి మండలం కోటపాడు గ్రామంలో గ్రామస్థులు నిరసనకు దిగారు. ఈ విషయంపై రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేశారు.

Differences in measurements of   toor dal in kotapadu
కోటపాడులో కందిపప్పు కొలతల్లో కోత.

By

Published : Jun 10, 2020, 12:15 PM IST

శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాళి మండలం కోటపాడు గ్రామంలో గ్రామస్థులు నిరసనకు దిగారు. కిలో కందిపప్పుకు బదులు 770 గ్రాముల పప్పు.. పంపిణీ చేయడంతో ధర్నా చేశారు. రేషన్ ద్వారా పంపిణీ చేసే కందిపప్పులో కోత విధించడంతో ..వారు రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేశారు. గ్రామ వాలంటీర్లు లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి బియ్యం, కందిపప్పు పంపిణీ చేశారు. ప్రభుత్వం నిర్దేశించిన కవర్లలో కాకుండా పాలిథిన్ సంచుల్లో పప్పును ఉంచి పంపిణీ చేశారు. కొలతలపై అనుమానం వచ్చిన గ్రామస్థులు తూకం వేయడంతో.. భారీ వ్యత్యాసం కనిపించింది. వాలంటీర్లు తమకు సంబంధం లేదని, డీలరు ఇచ్చిన మేరకు పంపిణీ చేశామని చెప్పారు. వారు డీలరు ఉమాపతిని ఫోన్​లో నిలదీశారు. వాలంటీర్లు చేసిన తప్పిదంతో తమకు 150 కిలోల కందిపప్పు తక్కువగా వచ్చిందని.., అందుకే కోత విధించాల్సి వచ్చిందని డీలర్ తెలిపారు. కొలతల్లో తేడాపై విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని పౌర సరఫరాల ఉప తహసీల్దార్ రాంబాబు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details