ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

గ్రామానికి మధ్యలో మద్యం దుకాణం...తొలగించాలని ఆందోళన - మురపాక గ్రామం మధ్యలో ఉన్న మద్యం

గ్రామం మధ్యలో ఉన్న మద్యం దుకాణాన్ని తొలగించాలంటూ... గ్రామస్థులంతా ధర్నా చేశారు. మెయిన రోడ్డులో మద్యం వద్దు అని నినదించారు. శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల నియోజకవర్గం మురపాక గ్రామంలో ఈ ఘటన జరిగింది.

మద్యం దుకాణం

By

Published : Sep 28, 2019, 8:03 PM IST

గ్రామానికి మధ్యలో మద్యం దుకాణం...తొలగించాలని ఆందోళన

శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల నియోజకవర్గం లావేరు మండలం మురపాక గ్రామం మధ్యలో ఉన్న మద్యం దుకాణాన్ని తొలగించాలంటూ దుకాణం ఎదుట గ్రామస్థులు ఆందోళనకు దిగారు. మద్యం దుకాణం సమీపంలో దేవాలయం, బ్యాంక్​, పోస్టాఫీసు ఉన్నాయి. ఈ మద్యం దుకాణం వల్ల తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని గ్రామస్థులంతా వాపోతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి వేరేచోటికి తరలించాలని వారు కోరారు.

ABOUT THE AUTHOR

...view details