Dharmana comments on welfare schemes: సంక్షేమ పథకాల ద్వారా ఇస్తున్న డబ్బులను ప్రజలు అపేయాలని చెప్పితే... వెంటనే నిలుపుదల చేస్తామని మంత్రి ధర్మాన ప్రసాదరావు వ్యాఖ్యానించారు. శ్రీకాకుళం పెద్ద రెల్లివీధిలో నిర్వహించిన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో మంత్రి ధర్మాన పాల్గొన్నారు. రాష్ట్రంలో అందరూ సంతోషంగా ఉన్నారంటే... జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలే కారణమన్నారు. ఎన్నికల సమయం కాకపోయినా.. ప్రజా సమస్యలు తెలిసుకునేందుకే ఈ కార్యక్రమాలను చేపడుతున్నామన్నారు. సంక్షేమ పథకాల అమలు తీరును తెదేపా నాయకులు విమర్శిస్తున్నారన్న మంత్రి ధర్మాన ప్రసాదరావు తెలిపారు. దేశమంతా నిత్యావసర రేట్లు ఒకే విధంగా ఉన్నాయని పేర్కొన్నారు.
ప్రజలు వద్దంటే సంక్షేమ పథకాలను ఆపేస్తాం: ధర్మాన ప్రసాదరావు - political news in Ap
Dharmana Prasada Rao comments: సంక్షేమ పథకాల ద్వారా ఇస్తున్న డబ్బులను ప్రజలు అపేయాలని చెప్పితే.. వెంటనే నిలుపుదల చేస్తామని మంత్రి ధర్మాన ప్రసాదరావు వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో అందరూ సంతోషంగా ఉన్నారంటే దానికి కారణం సీఎం జగన్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలే కారణమన్నారు.
Dharmana Prasada Rao