జిల్లాలోని నరనన్నపేట నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందిన ధర్మాన కృష్ణదాస్‌కు మంత్రివర్గంలో స్థానం దక్కింది. బీకాం పూర్తి చేసిన ధర్మాన కృష్ణదాస్... ఇప్పటివరకు నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2004, 2009లో కాంగ్రెస్ తరపున... 2012లో జరిగిన ఉపఎన్నికలో వైకాపా తరపున విజయం సాధించారు. తాజా సార్వత్రిక ఎన్నికల్లో నరసన్నపేట నియోజకవర్గం నుంచి గెలుపొంది మంత్రి పదవి దక్కించుకున్నారు.
ధర్మాన కృష్ణదాస్‌ను వరించిన మంత్రి పదవి - minister krishnadas
రాష్ట్ర మంత్రివర్గ ఏర్పాటుపై ఉత్కంఠ వీడింది. ముఖ్యమంత్రి జగన్ తన మంత్రివర్గంలో అన్ని సామాజిక వర్గాలకు ప్రాధాన్యం కల్పించారు. జిల్లా నుంచి ధర్మాన కృష్ణదాస్‌కు అవకాశం వచ్చింది
కృష్ణదాస్‌ను వరించిన మంత్రి పదవి
నియోజకవర్గం:నరసన్నపేట
వయస్సు: 64
విద్యార్హత:బీకాం
రాజకీయ అనుభవం:మూడుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నిక. ప్రస్తుతం రాష్ట్ర ఒలింపిక్ సంఘం అధ్యక్షుడిగా పనిచేస్తున్నారు.