ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

Dharmana: 'సమస్యల పరిష్కారం కోసమే భూముల రీ-సర్వే' - ధర్మాన కృష్ణదాస్ తాజా వార్తలు

భూ సమస్యల పరిష్కారం కోసం భూముల రీ-సర్వే కార్యక్రమం అమలు చేస్తున్నామని ఉపముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ తెలిపారు. సమగ్ర సర్వేకు ఆధునిక పరికరాల వినియోగిస్తున్నామన్నారు.

land re survey
భూముల రీ-సర్వే

By

Published : Jun 17, 2021, 7:50 PM IST

భూ సమస్యల పరిష్కారం కోసం...భూముల రీ-సర్వే కార్యక్రమాన్ని అమలు చేస్తున్నట్లు ఉపముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ తెలిపారు. శ్రీకాకుళం జిల్లా పాలకొండ మండలం పరశురాంపురంలో...YSR జగనన్న శాశ్వత భూ హక్కు పథకంలో భాగంగా..సర్వే రాళ్ల ఏర్పాటు చేసే కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.

సర్వే ఆఫ్ ఇండియా సహకారంతో రూ.938 కోట్లతో భూ సర్వే జరుపుతున్నట్లు ఆయన తెలిపారు. ఎటువంటి లోపాలు తలెత్తకుండా..సమగ్రంగా సర్వే చేసేందుకు ఆధునిక పరికరాల వినియోగిస్తున్నట్లు వెల్లడించారు. డ్రోన్లు, రాడార్లు వంటి ఆధునిక విధానంలో సర్వే చేపడుతున్నామన్నారు.

ABOUT THE AUTHOR

...view details