చిక్కీలు అనగానే పల్లీలు, బాదం పప్పులతో చేసినవే గుర్తుకు వస్తాయి. శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలో ధనుర్మాసం రావడంతో ఈ చిక్కీలు అందరి ఇళ్లల్లో వేడుకలు తీసుకొస్తాయి. కోతలు కోసాకా...కొత్త ధాన్యాన్ని దంచి వాటి పాలతో చిక్కీలు చేస్తారు. ఈ పాలకు, పేలాలు, పంచదార పాకాన్ని కలిపి... వేర్వేరు ఆకృతుల్లో వీటిని తయారుచేస్తారు. ఇందులో మంచి పోషకాలుంటాయి...అంతేగాక కొబ్బరి ముక్కలు, జీడిపప్పు, బాదం పప్పులతో అలంకరిస్తారు. సంక్రాంతి పర్వదినం కావున ఇంటికొచ్చిన ఆడపడుచులకు, పెళ్లైన ఆడపిల్లలకు వీటిని సారెగా, స్నేహితులు ,ఇంటిచుట్టుపక్కల వాళ్లు వాయినంగా ఇస్తారు. ఈ నెలంతా ఆడవాళ్లు వీటి తయారీ నుంచి ఉపాధి పొందుతారు.పెళ్లయిన ఆడ పిల్లలను పండగకి పుట్టింటికి పిలవటానికి వెళ్లినప్పుడు ఇవి ఇచ్చి ఆహ్వానిస్తారు. స్నేహితులు, ఆత్మీయులు వీటిని ఒకరికొకరు ఇచ్చి పుచ్చుకొని అందులోని పంచదార, పేలాలు ఎలా కలిసి ఉంటాయో.. అలానే అందరూ కలిసి ఉండాలని ఆశిస్తారు. వీటి ధర రూ. 20 నుంచి రూ. 250 వరకు ఉంటుంది. ఇవి కేవలం నెలరోజులు మాత్రమే దొరుకుతాయి.
ధనుర్మాసంలో మాత్రమే దొరికే చిక్కీలు... ఎక్కడో తెలుసా మీకూ! - శ్రీకాకుళంలో ధనుర్మాస చిక్కీలు
పల్లి చిక్కీ లాంటివి ఏ కాలంలోనైనా దొరుకుతాయి కానీ ధనుర్మాసంలో మాత్రమే దొరికే ఈ చిక్కీలు గురించి తెలుసా! అవును ఈ చిక్కీలు ధనుర్మాసం మొదలవగానే వరి పంటలు పూర్తవగానే ధాన్యంలోని పాలతో తయారుచేసి విక్రయిస్తారు. కేవలం నెలరోజులు మాత్రమే దొరుకుతాయి. మళ్లీ తినాలంటే సంక్రాంతి వచ్చేవరకు వేచిఉండాల్సిందే మరి! ఎక్కడున్నాయో తెలుసుకొని వెంటనే కొనేద్దామా!

ధనుర్మాసం చిక్కీలు
ధనుర్మాసంలో మాత్రమే దొరికే ఈ చిక్కీలు తెలుసా మీకూ!