ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

PROTEST : 'దళితులపై దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలి' - dhalith union leaders protest in srikakulam district

శ్రీకాకుళం జిల్లా బూర్జ పోలీస్ స్టేషన్ వద్ద దళిత సంఘాల నాయకులు ఆందోళన చేపట్టారు. సుంకరపేట గ్రామంలో దళితులపై దాడికి పాల్పడ్డ వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.

బార్జలో దళిత సంఘాల ఆందోళన
బార్జలో దళిత సంఘాల ఆందోళన

By

Published : Oct 3, 2021, 4:27 PM IST

శ్రీకాకుళం జిల్లా బూర్జ మండలం సుంకరపేటలో దళితులపై జరిగిన దాడిని ఖండిస్తూ... బూర్జ పోలీస్​స్టేషన్ వద్ద దళిత సంఘాల నేతలు ఆందోళన చేపట్టారు. సుంకరపేటలో ర్యాలీ నిర్వహించారు. దళితులపై దాడి చేసిన వారిని తక్షణమే శిక్షించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో వైకాపా ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత దళితులపై దాడులు అధికమయ్యాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైకాపా నాయకులు, కార్యకర్తలు ఇష్టారీతిన వ్యవహరిస్తున్నారని, వీరికి పోలీసులు సహకరించడంతో దాడులు మరింత ఉద్ధృతం అయ్యాయని మండిపడ్డారు.

ABOUT THE AUTHOR

...view details