ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

మద్యం మత్తులో వీరంగం.. ఇళ్లపై రాళ్లు రువ్వుతూ దాడి - స్థానికులపై దాడి చేసిన పాతపట్నం నీలమణి దుర్గ అమ్మవారి భక్తులు

శ్రీకాకుళం జిల్లా పాతపట్నం మండల కేంద్రంలోని నీలమణి దుర్గ అమ్మవారి ఆలయం వద్ద.. మద్యం మత్తులో కొందరు వ్యక్తులు సమీపంలోని ఇళ్లపై రాళ్లు రువ్వారు.

devotees stones pelt on houses at patapatnam
పాతపట్నంలో మద్యం మత్తులో ఇళ్లపై రాళ్లు రువ్విన భక్తులు

By

Published : Mar 1, 2021, 6:05 AM IST

శ్రీకాకుళం జిల్లా పాతపట్నం మండల కేంద్రంలోని శ్రీ నీలమణి దుర్గ అమ్మవారి ఆలయం సమీపంలో కొందరు వీరంగం సృష్టించారు. మద్యం సేవించి ఇళ్లపై రాళ్లు, సీసాలు విసిరారు. ప్రశ్నించిన స్థానికులపై దాడికి దిగారు. ఈ ఘటనతో పలువురు భక్తులు భయాందోళనకు గురయ్యారు.

టెక్కలి నుంచి వచ్చిన కొందరు భక్తులు మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం సమీపంలోని తోటలో మద్యం సేవించారు. మత్తులో స్థానిక ఇళ్లపై దాడి చేశారు. ఈ ఘటనలో శ్రీనివాస్ బరికో అనే వ్యక్తి కుటుంబీకులకు గాయాలయ్యాయి. పోలీసులు ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై అమీర్ ఆలీ తెలిపారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details