Devotee Builts Like Tirumala Temple: శ్రీవారి దర్శనానికి నిత్యం వేల మంది భక్తులు తిరుమలకు వస్తుంటారు. భక్తజన సంద్రం తాకిడికి అందరికీ తనివితీరా స్వామివారి దర్శనం కలగకపోవచ్చు. అలాంటి సందర్భాల్లో మనమైతే ఏం చేస్తాం.. ఇంకోసారి వచ్చినప్పుడు కనులారా ఆ వైకుంఠనాథుడ్ని దర్శించుకుందామని సరిపెట్టుకుంటాం. కానీ పలాసకు చెందిన హరిముకుంద పండా కుటుంబం.. అందుకు పూర్తి భిన్నం. పదేళ్ల క్రితం తిరుమలకు వెళ్లినప్పుడు వెంకటేశ్వరుడి దర్శనం సంతృప్తికరంగా జరగకపోడవంతో.. తిరుమల లాంటి ఆలయాన్నే పలాసలో కట్టాలని సంకల్పించారు. ఆ మేరకు ఐదేళ్ల క్రితం నిర్మాణం ప్రారంభించారు. దాదాపు పూర్తికావచ్చిన ఆ దివ్యధామం విశేషాలు మనమూ తెలుసుకుందాం.
Venkateswara Swamy Temple at Palasa: అద్భుత నిర్మాణ కౌశలంతో రూపుదిద్దుకుంటున్న ఆలయాన్ని దగ్గరుండి మరీ కట్టిస్తున్న ఈయన పేరు హరిముకుంద పండా. ఒడిశా రాజ కుటుంబానికి చెందినవారు. పదేళ్ల క్రితం ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్‌తో తిరుమలకు వెళ్లిన పండా.. చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. దర్శనం చేసుకునే సమయంలో ముందుకు తోసేయడంతో చాలా బాధ పడ్డారు. సంతృప్తికరంగా స్వామిని సేవించుకోలేక పోయానని ఆవేదన చెందారు. ఇంటికి తిరిగొచ్చాక ఈ విషయాన్ని తల్లి హరివిష్ణుప్రియకు చెప్పారు.
TTD Temple in Mumbai: నవీ ముంబయిలో తిరుమల శ్రీవారి ఆలయానికి భూమి పూజ
Old Man Building Temple Like Tirumala: దాదాపు 110 ఏళ్ల వయసుల్లోనూ నిత్యం అమ్మవారి ఆరాధన చేస్తూ, సాయం కోసం ఇంటికి వచ్చే వారికి దానధర్మాలు చేస్తూ జీవనం సాగించే హరివిష్ణుప్రియ.. ఏం చేద్దామా అని ఆలోచించారు. తన కుమారుడిలాగే సాధారణ ప్రజలు ఇబ్బంది పడుతూ ఉండవచ్చని భావించారు. అలాంటి వారందరి కోసం తిరుమల ఆలయాన్ని పోలిన గుడి నిర్మించాలని సంకల్పించారు. అందుకోసం పలాసలో తనకున్న కొబ్బరి తోటలో 12 ఎకరాల స్థలం కేటాయించారు. తల్లి సూచనల ప్రకారం ఐదేళ్ల క్రితం శ్రీవారి ఆలయ నిర్మాణం చేపట్టామని హరిముకుంద తెలిపారు.