ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'అన్ని వర్గాల వారికి సమన్యాయం అందించడమే ప్రభుత్వం లక్ష్యం'

రాష్ట్రంలోని అన్ని వర్గాల వారికి సమన్యాయం అందించడమే ప్రభుత్వ లక్ష్యమని ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ పేర్కొన్నారు. శ్రీకాకుళం కలెక్టర్ కార్యాలయంలో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులపై సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సమావేశం నిర్వహించారు.

deputy cm dharmana on sc st act
deputy cm dharmana on sc st act

By

Published : Jul 28, 2021, 8:56 PM IST

ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధన చట్టం, అట్రాసిటీ కేసులపై సాంఘిన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో శ్రీకాకుళం కలెక్టరేట్ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ పాల్గొన్నారు. రాష్ట్రంలోని అన్ని వర్గాల వారికి సమన్యాయాన్ని అందించడమే ప్రభుత్వం లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. ఎస్సీ, ఎస్టీలపై అత్యాచారాలు, అకృత్యాలు, దాడులపై ప్రభుత్వం తీవ్రంగా స్పందిస్తుందన్న ఉపముఖ్యమంత్రి కృష్ణదాస్.. దోషులు ఎంతటివారైనా ఉపేక్షించేది లేదని స్పష్టం చేసారు. ఇది ప్రజాస్వామ్య దేశమన్న ఆయన.. ప్రతీ ఒక్కరికి సమన్యాయం తప్పక లభిస్తుందని అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలోని ఇతర జిల్లాలతో పోలిస్తే శ్రీకాకుళం జిల్లాలో మెరుగైన స్థితి కనిపిస్తుందన్న కృష్ణదాస్.. ఇది శుభపరిణామమన్నారు. జిల్లాలో ఎస్సీ, ఎస్టీలకు ఎక్కడైనా అన్యాయం జరిగితే తక్షణమే ఫిర్యాదు చేయాలని కృష్ణదాస్ కోరారు.

ABOUT THE AUTHOR

...view details