శ్రీకాకుళం జిల్లా వైకాపా కార్యాలయంలో పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ మాట్లాడారు. 'ఎన్నికల్లో ఎంతో మంది పోటీ చేద్దామనుకుంటారు. అది అందరికీ సాధ్యపడదు. ఎన్నికల్లో చాలాసార్లు పోటీచేసినవారు ఉంటారు. అలాంటి వారు తప్పుకొని మిగిలినవారికి అవకాశం కల్పించాలి. అయితే మీకు ఓ సందేహం రావొచ్చు. ఇంత చెబుతున్న మీరు నాలుగైదు సార్లు గెలిచారు కదా? మీరెందుకు రాజకీయాల్లో కొనసాగుతున్నారని అనవచ్చు. నేను కూడా వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.' అని ధర్మాన వ్యాఖ్యానించారు.
వచ్చే ఎన్నికల్లో పోటీచేయను: ఉప ముఖ్యమంత్రి ధర్మాన - వచ్చే ఎన్నికల్లో పోటీ చేయనన్న ధర్మాన కృష్ణదాస్ వార్తలు
వచ్చే ఎన్నికల్లో పోటీ చేయబోనని ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ తెలిపారు. మిగిలిన వారికి అవకాశం ఇవ్వాలని భావిస్తున్నట్టు చెప్పారు.

వచ్చే ఎన్నికల్లో పోటీచేయను: ఉప ముఖ్యమంత్రి ధర్మాన