చేనేత కుటుంబాలు ఆర్థికంగా బలపడాలనే ఉద్దేశ్యంతో సీఎం జగన్మోహన్ రెడ్డి నేతన్ననేస్తం కార్యక్రమం చేపట్టారని ఉపముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ అన్నారు. శ్రీకాకుళం కలెక్టర్ కార్యాలయంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఉపముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్, సభాపతి తమ్మినేని సీతారాంతో పాటు ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్... ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రారంభించిన నేతన్న నేస్తం కార్యక్రమంలో పాల్గొన్నారు. వరుసగా మూడవ ఏడాది నేతన్నలకు ఆర్థిక సహాయం అందించామని కృష్ణదాస్ తెలిపారు.
DEPUTY CM: 'చేనేత కుటుంబాలు ఆర్థికంగా బలపడాలనే నేతన్న నేస్తం'
చేనేత కుటుంబాలు ఆర్థికంగా బలపడాలనే ఉద్దేశ్యంతో సీఎం జగన్మోహన్ రెడ్డి నేతన్ననేస్తం కార్యక్రమం చేపట్టారని ఉపముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ అన్నారు. జిల్లాలో 2021-22 సంవత్సరంలో 1,601 మందికి 3 కోట్ల 84 లక్షలను నేతన్న నేస్తంగా అందించడం జరుగుతుందని తెలిపారు.
చెక్కులను లబ్ధిదారులకు అందిస్తున్న డిప్యూటీ సీఎం
జిల్లాలో 2021-22 సంవత్సరంలో 1,601 మందికి 3 కోట్ల 84 లక్షలను నేతన్న నేస్తంగా అందించడం జరుగుతుందని తెలిపారు. 2020-2021లో 1,775 మందికి 4 కోట్ల 26 లక్షలు ఇవ్వగా.. 2019-20 సంవత్సరంలో 14 వందల 57 మందికి 3 కోట్ల 50 లక్షలు అందించామన్నారు. ఈ సందర్భంగా లబ్దిదారులకు లాంఛనంగా చెక్కులను పంపిణీ చేశారు.
ఇదీ చదవండి: