భూ సర్వేను జనవరిలో ప్రారంభించి మూడేళ్లలో పూర్తి చేస్తామని మంత్రి ధర్మాన కృష్ణదాస్ అన్నారు. ప్రతిపక్షాలు భూములు అమ్మేస్తున్నారని గోల పెడుతున్నారన్న కృష్ణదాస్.. పూర్తి పారదర్శకతో దేశంలో ఎవరైనా భూములను కొనుగోలు చేసేలా ఈ-వేలం వేస్తున్నామని చెప్పారు. అలాగే నాణ్యమైన విద్యుత్ అందించేందుకు మీటర్లు బిగిస్తున్నామని చెప్పిన కృష్ణదాస్.. 30 ఏళ్ల వరకు ఉచిత విద్యుత్తు ఇచ్చేలా రూపకల్పన చేశామన్నారు.
జనవరిలో సమగ్ర భూ సర్వే: ధర్మాన కృష్ణదాస్ - ఏపీలో సమగ్ర భూ సర్వే తాజా వార్తలు
రాష్ట్రంలో సమగ్ర భూ సర్వే చేస్తామని ఉపముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ పేర్కొన్నారు. నాణ్యమైన విద్యుత్ అందించేందుకు మీటర్లు బిగిస్తున్నామని తెలిపారు.
జనవరిలో సమగ్ర భూ సర్వే: ధర్మాన