దేశంలోనే అత్యంత అభివృద్ధి చెందిన రాష్ట్రంగా ఏపీని తీర్చిదిద్దుతామని డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ అన్నారు. శ్రీకాకుళం జిల్లా జలుమూరు మండలం పర్లాం గ్రామంలో అంబేడ్కర్ విగ్రహావిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... రాష్ట్రం ప్రగతి పథాన నడుస్తోందని అన్నారు. రాబోయే రోజుల్లో మరింత అభివృద్ధి చేసి.. ఉత్తమ రాష్ట్రంగా తీర్చిదిద్దుతామని ఆశాభావం వ్యక్తం చేశారు.
ఏపీని ఉత్తమ రాష్ట్రంగా తీర్చిదిద్దుతాం: మంత్రి ధర్మాన - డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ తాజా వార్తలు
రాబోయే రోజుల్లో రాష్ట్రాన్ని మరింత అభివృద్ధి చేస్తామని డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ అన్నారు. దేశంలోనే అత్యంత అభివృద్ధి చెందిన రాష్ట్రంగా ఏపీని తీర్చిదిద్దుతామన్నారు.
deputy cm dharmana krishna das