ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

DHARMANA : 'ఆరోపణలను రుజువు చేస్తే తక్షణమే రాజీనామా చేస్తా' - deputy cm dharmana krishna das resignation news

తనపై చేస్తున్న ఆరోపణలను రుజువు చేస్తే తక్షణమే రాజీనామా(resignation) చేస్తానని మంత్రి ధర్మాన కృష్ణదాస్ అన్నారు(dharmana krishna das). పేదలకు ఇళ్ల నిర్మాణంపై తెలుగుదేశం పార్టీ అడుగడుగునా అడ్డుకుంటోందని మంత్రి కృష్ణదాస్ ఆరోపించారు.

మంత్రి ధర్మాన కృష్ణదాస్
మంత్రి ధర్మాన కృష్ణదాస్

By

Published : Oct 10, 2021, 4:23 PM IST

తనపై తెదేపా నేతలు(TDP leaders) చేస్తున్న ఆరోపణలను రుజువు చేస్తే... తక్షణమే రాజీనామా(resignation) చేస్తానని రాష్ట్ర ఉపముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్(deputy cm dharmana krishna das) సవాల్ విసిరారు. శ్రీకాకుళం జిల్లా జలుమూరు మండలం కరవంజ గ్రామంలో వైఎస్సార్ ఆసరా(YSR asara) చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఇసుక అక్రమాలకు పాల్పడుతున్నట్లు చేస్తున్న ఆరోపణలను ఖండించారు. వాటిని రుజువు చేస్తే అదే క్షణంలో రాజీనామా చేస్తానన్నారు. పేదలకు ఇళ్ల నిర్మాణంపై తెలుగుదేశం పార్టీ అడుగడుగునా అడ్డుకుంటోందని మంత్రి కృష్ణదాస్ ఆరోపించారు.

ABOUT THE AUTHOR

...view details