ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కరోనా నియంత్రణకు మరింత అప్రమత్తత అవసరం: డిప్యూటీ సీఎం - dharmana krishna das call to people over covid pandamic

కరోనా సెకండ్ వేవ్ ప్రారంభమైన దృష్ట్యా..ప్రతి ఒక్కరూ మరింత అప్రమత్తంగా ఉండాలని ఉపముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ అన్నారు. సభాపతి తమ్మినేనితో కలిసి మాట్లాడిన మంత్రి... ప్రజలందరూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

deputy cm dharmana krishna das
deputy cm dharmana krishna das

By

Published : Dec 12, 2020, 4:49 PM IST

కరోనా నియంత్రణకు మరింత అప్రమత్తత అవసరమని డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ అన్నారు. శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో సభాపతి తమ్మినేని సీతారాం, కలెక్టర్ నివాస్​తో కలిసి మాట్లాడారు. ప్రజల ఆరోగ్య పరిరక్షణకు సీఎం జగన్ నిరంతరం కృషి చేస్తున్నారని చెప్పారు.

దేశంలో అత్యధికంగా కరోనా పరీక్షలు నిర్వహించిన రాష్ట్రం మనదేనన్నారు. జిల్లా కలెక్టర్ నివాస్ ఆధ్వర్యంలో అధికార యంత్రాంగం అత్యుత్తమ సేవలు అందించిందని సభాపతి తమ్మినేని సీతారాం ప్రశంసించారు. ప్రభుత్వ చర్యల ఫలితంగానే కరోనా తీవ్రత తగ్గిందన్నారు.

ABOUT THE AUTHOR

...view details