ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'ఆలయాలపై దాడులు దురదృష్టకరం' - deputy cm dharmana krihnadas latest news

శ్రీకాకుళం జిల్లాలో ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ పర్యటించారు. అరసవెల్లి, శ్రీకూర్మం దేవాలయాలను సతీసమేతంగా దర్శించుకున్నారు. రాష్ట్రంలోని దేవాలయాల్లో జరుగుతున్న దాడులు దురదృష్టకరమన్నారు.

deputy cm dharmana krihnadas tour in srikakulam district
ఉపముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్

By

Published : Jan 5, 2021, 4:11 PM IST

రాష్ట్రంలోని దేవాలయాల్లో జరుగుతున్న దాడులు దురదృష్టకరమని ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ ఆవేదన వ్యక్తం చేశారు. శ్రీకాకుళం జిల్లా అరసవెల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి, శ్రీకూర్మం లోని శ్రీకూర్మనాథస్వామి ఆలయాలను ఉప ముఖ్యమంత్రి కృష్ణదాస్... సతీసమేతంగా దర్శించుకున్నారు.

ముఖ్యమంత్రి జగన్... పర్యటన పెట్టుకున్న ప్రాంతాల్లో ఒకటి రెండు రోజుల ముందు ఇటువంటి సంఘటనలు జరుగుతున్నాయని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. రామతీర్థం ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నట్టు చెప్పారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూస్తామన్నారు.

ABOUT THE AUTHOR

...view details