ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

శ్రీకాకుళంలో మెగా జాబ్ మేళా.. ప్రారంభించిన ఉపముఖ్యమంత్రి - శ్రీకాకుళం జిల్లాలో జాబ్ మేళా ప్రారంభం

రాష్ట్ర ఉపముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో జాబ్​మేళాను ప్రారంభించారు. తమ ప్రభుత్వం స్థానికంగా 75శాతం యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తోందని ఆయన చెప్పారు.

deputy cm dharmana krihnadaas attend to start job mela
deputy cm dharmana krihnadaas attend to start job mela

By

Published : Oct 31, 2021, 5:54 PM IST

పరిశ్రమల ఏర్పాటుతో తమ ప్రభుత్వం యువతకు స్థానికంగా 75% ఉద్యోగావకాశాలు కల్పిస్తోందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ అన్నారు. ఆదివారం శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో మెగా జాబ్ మేళాను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నిరుద్యోగ యువత తమ నైపుణ్యాన్ని పెంచుకుని ఉద్యోగాలు సాధించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పలువురు అధికారులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.

ABOUT THE AUTHOR

...view details