రైతులకు అందే విద్యుత్ ఎప్పటికీ ఉచితమేనని.. ఇందులో ఎటువంటి సందేహాలకు తావులేదని ఉపముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ స్పష్టం చేసారు. వైఎస్సార్ ఉచిత వ్యవసాయ విద్యుత్ పథకం లబ్ధిదారుల ఖాతాలకు నగదు బదిలీపై అవగాహన సదస్సు శ్రీకాకుళం కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించారు. 30 ఏళ్ల పాటు వైఎస్సార్ ఉచిత వ్యవసాయ విద్యుత్ పథకం అమల్లో ఉండే విధంగా విధానపరమైన నిర్ణయం తీసుకుంటామని అన్నారు. ఉచిత విద్యుత్ పథకానికి మెరుగులు దిద్ది రైతు సాధికారత దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోందన్నారు. ప్రస్తుతం రైతులకు ఉన్న ఒక్క కనెక్షన్ కూడా తొలగించబోమన్న కృష్ణదాస్.. అనధికారికంగా ఉండే కనెక్షన్లను రెగ్యులరైజ్ చేస్తామన్నారు. ఇప్పటివరకు విద్యుత్ కనెక్షన్లు లేని రైతులు కూడా ఈ పథకంలో భాగస్వాములు అవుతారన్న ఉపముఖ్యమంత్రి.. వారికి కూడా కొత్త కనెక్షన్లు ఇస్తామన్నారు. వ్యవసాయ విద్యుత్ కనెక్షన్ ఉన్న రైతు పేరు మీద ప్రత్యేక బ్యాంకు ఖాతాను తెరచి ఆ ఖాతాలో విద్యుత్ బిల్లులకు చెల్లించవలసిన డబ్బులను జమచేస్తామన్నారు. రాష్ట్రంలో ఈ పథకం ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి అమల్లోకి వస్తుందన్నారు. జిల్లాలో ఉచిత వ్యవసాయ విద్యుత్ పథకాన్ని ప్రయోగాత్మకంగా ప్రారంభించడం జరిగిందని సభాపతి తమ్మినేని సీతారాం పేర్కొన్నారు.
ఏ ఒక్క కనెక్షన్ తొలగించం: ఉపముఖ్యమంత్రి ధర్మాన
శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో వైఎస్సార్ ఉచిత వ్యవసాయ విద్యుత్ పథకం లబ్ధిదారుల ఖాతాలకు నగదు పథకంపై అవగాహన సదస్సు నిర్వహించారు. ప్రస్తుతం రైతులకు ఉన్న ఏ ఒక్క కనెక్షన్ కూడా తొలగించమని.. ఉపముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ స్పష్టం చేశారు.
ఉపముఖ్యమంత్రి ధర్మాన