శ్రీకాకుళం జిల్లాలో ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ పాదయాత్ర నిర్వహించారు. నరసన్నపేట సమీపంలోని పైడితల్లి ఆలయం నుంచి మారుతీనగర్ కూడలి వరకు పాదయాత్ర సాగింది. అనంతరం వైస్సార్ విగ్రహానికి పూలమాల వేసి, నివాళులు అర్పించారు. నవరత్నాలు పథకం అమలుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని కృష్ణదాస్ అన్నారు. ఈ కార్యక్రమంలో వైకాపా నాయకుడు ధర్మాన కృష్ణ చైతన్య, కార్యకర్తలు, శిష్టకరణం కార్పొరేషన్ డైరెక్టర్ ఎస్.కృష్ణ తదితరులు పాల్గొన్నారు.
శ్రీకాకుళం జిల్లాలో వైకాపా నాయకుల పాదయాత్ర - padayatra in srikakulam news
వైఎస్ జగన్ మోహన్రెడ్డు పాదయాత్ర చేపట్టి మూడు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ పాదయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా వై.ఎస్.రాజశేఖర్రెడ్డి విగ్రహానికి పూలమాల వేసి, నివాళులర్పించారు.
శ్రీకాకుళంలో పాదయాత్ర