శ్రీకాకుళంలోని జీటీ రోడ్డులో లలితా జ్యువెలరీ నూతన షోరూంను ఉపముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్, ఎమ్మెల్యే ధర్మాన ప్రసాదరావు ప్రారంభించారు. దేశవ్యాప్తంగా పేరున్న లలితా జ్యువెలరీ షోరూంను శ్రీకాకుళంలో ప్రారంభం కావడం సంతోషంగా ఉందని ఉప ముఖ్యమంత్రి అన్నారు. జిల్లావాసుల తరుపున ప్రత్యేక అభినందనలు తెలిపారు. అలాగే ఈ వేడుకకు తెదేపా ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడు హాజరయ్యారు.
శ్రీకాకుళంలో లలితా జ్యువెలరీ నూతన షోరూం ప్రారంభం - శ్రీకాకుళం సమాచారం
వ్యాపారంలో అగ్రగామిగా నిలిచిన లలితా జ్యువెలరీ నూతన షోరూంను శ్రీకాకుళంలో ఉపముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్, ఎమ్మెల్యే ధర్మాన ప్రసాదరావు ప్రారంభించారు. ఈ వేడుకకు హాజరైన తెదేపా ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడు లలితా జ్యువెలరి అధినేత కిరణ్ కుమార్‌కు అభినందనలు తెలిపారు.
శ్రీకాకుళంలో లలితా జ్యువెల్లరీ నూతన షోరూం ప్రారంభం
శ్రీకాకుళంతో పాటు.. విశాఖపట్నంలోని గోపాలపట్నంలోనూ.. నూతన షోరూంలను ఈ రోజు ప్రారంభించామని లలితా జ్యువెల్లరీ అధినేత కిరణ్ కుమార్ చెప్పారు. దక్షిణ భారత దేశంలో అగ్రగామిగా నిలిచిన లలితా జ్యువెలరీకి బంగారం, వజ్రాభరణాల వ్యాపారంలో 37 ఏళ్ల అనుభవముందని తెలిపారు. తెలుగు రాష్ట్రాల్లో మరో ఆరు నెలల్లో మరెన్ని కొత్త షోరూంలను ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు.