'ప్రభుత్వ ఆదేశాల మేరకు రాష్ట్రవ్యాప్తంగా గోపూజ ఉత్సవాలు' - శ్రీకాకుళంలో గోపూజ ఉత్సవాలు న్యూస్
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్.. శ్రీకాకుళం జిల్లా, నరసన్నపేటలోని వేంకటేశ్వర ఆలయంలో గోపూజ ఉత్సవాన్ని నిర్వహించారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా గోపూజ వేడుకలను చేపట్టామని తెలిపారు.
!['ప్రభుత్వ ఆదేశాల మేరకు రాష్ట్రవ్యాప్తంగా గోపూజ ఉత్సవాలు' Deputy Chief Minister Dharmana Krishnadas conducted the Gopuja at Narasannapeta in Srikakulam district](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-10250604-422-10250604-1610703996778.jpg)
'ప్రభుత్వ ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా గోపూజ ఉత్సవాలు'
శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలోని శ్రీ వేంకటేశ్వర ఆలయంలో ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ గోపూజ ఉత్సవాన్ని నిర్వహించారు. దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో గోపూజలను జరపాలని ప్రభుత్వం ఆదేశించినట్లు కృష్ణదాస్ తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా గోపూజ ఉత్సవాలు నిర్వహిస్తున్నామని అన్నారు. ఆలయ వేద పండితులు శ్రీరామ్ ఆచార్యులు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ ఉత్సవంలో దేవాదాయ శాఖ సహాయ కమిషనర్ సూర్య ప్రకాష్, తదితరులు పాల్గొన్నారు.