ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

సీఎం జగన్మోహన్‌రెడ్డి బీసీలకు పెద్దపీట వేశారు: ఉపముఖ్యమంత్రి - వాల్మీకి జయంతోత్సవం

వాల్మీకి మహర్షి జీవితం అందరకీ ఆదర్శమని ఉపముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ పేర్కొన్నారు. ఒక బోయవాని ఇంట జన్మించిన వాల్మీకి మహర్షిగా మారి.. పవిత్ర రామాయణ గ్రంథాన్ని మనకు అందించారని అన్నారు.

ministers in valmiki jayanthi
వాల్మీకి జయంతోత్సవంలో మంత్రులు

By

Published : Oct 31, 2020, 4:46 PM IST

Updated : Oct 31, 2020, 6:38 PM IST

వాల్మీకి చరిత్ర అందరూ తెలుసుకోవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉందని ఉపముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ పేర్కొన్నారు. శ్రీకాకుళం జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమశాఖ ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయంలో... మహర్షి వాల్మీకి జయంతిని ఘనంగా నిర్వహించారు. సీఎం జగన్మోహన్‌రెడ్డి బీసీలకు పెద్దపీట వేశారన్నారు. ఒక బోయవాని ఇంట జన్మించిన వాల్మీకి మహర్షిగా మారి.. పవిత్ర రామాయణ గ్రంథాన్ని మనకు అందించారని ఉపముఖ్యమంత్రి చెప్పారు. ఈ కార్యక్రమంలో ఉపముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్, సభాపతి తమ్మినేని సీతారాం పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేశారు.

Last Updated : Oct 31, 2020, 6:38 PM IST

ABOUT THE AUTHOR

...view details