వైఎస్సార్ ఉచిత విద్యుత్ అన్నదాతలకు ఆసరాగా ఉంటుందని ఉపముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ అన్నారు. శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట, జలుమూరు మార్కెట్ కమిటీల తొలి సమావేశంలో ఆయన పాల్గొన్నారు. రాష్ట్రంలో ఉచిత విద్యుత్ పథకానికి శ్రీకాకుళం నుంచి శ్రీకారం చుడతామని ధర్మాన తెలిపారు. ఈ పథకం కోసం రూ.6.6 కోట్ల నిధులు విడుదల అయ్యాయని వెల్లడించారు.
'వైఎస్సార్ ఉచిత విద్యుత్ పథకానికి శ్రీకాకుళం నుంచే శ్రీకారం' - రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన తాజా వార్తలు
వైఎస్సార్ ఉచిత విద్యుత్ పథకానికి శ్రీకాకుళం నుంచే శ్రీకారం చుడతామని ఉపముఖ్యమంత్రి, రెవెన్యూశాఖ మంత్రి ధర్మాన కృష్ణదాస్ చెప్పారు. ఉచిత విద్యుత్ పథకం అన్నదాతలకు ఆసరాగా ఉంటుందని పేర్కొన్నారు. నరసన్నపేట, జలుమూరు మార్కెట్ కమిటీల సమావేశంలో పాల్గొన్న ఆయన... మార్కెట్ కమిటీలు అన్నదాతలకు చేరువకావాలని సూచించారు.
dharmana krishna
మార్కెట్ కమిటీలు అన్నదాతలకు చేరువకావాలని ధర్మాన సూచించారు. మార్కెట్ కమిటీలను బలోపేతం చేయడానికి అధికారులు కృషి చేయాలని కోరారు. మార్కెట్ కమిటీ అధ్యక్షుడు పొన్నాన దాలినాయుడు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో పలువురు అధికారులు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి :కృష్ణమ్మకు కొనసాగుతున్న వరద ఉద్ధృతి