మొదటి దశ పంచాయతీ ఎన్నికల్లో వైకాపా మద్దతుదారుల ప్రభంజనం కొనసాగిందని ఉపముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ అన్నారు. శ్రీకాకుళం జిల్లా వైకాపా కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించిన ఆయన.. జగన్ పరిపాలన చూసి అందరూ ఆదరించారన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో జగన్ మద్దతు సంపూర్ణంగా ఉంటుందన్నారు.
తెలంగాణలో పార్టీ.. షర్మిల వ్యక్తిగత ఆలోచన: కృష్ణదాస్ - పంచాయతీ ఫలితాలపై ధర్మాన కృష్ణదాస్ కామెంట్స్
మెుదటి విడత పంచాయతీ ఎన్నికల్లో వైకాపా ప్రభంజనం కొనసాగిందన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం జగన్మోహన్‌రెడ్డి మద్దతు సంపూర్ణంగా ఉంటుదని ఉపముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ స్పష్టం చేశారు. కేంద్రానికి ఇప్పటికే లేఖ రాశారన్నారు. షర్మిల పార్టీ విషయం ఆమె వ్యక్తిగతమన్నారు.
deputy chief minister dharmana krishna das on vishaka steel plant
తెలంగాణలో పార్టీ ఆలోచన షర్మిల వ్యక్తిగత ఆలోచనేనని ధర్మాన కృష్ణదాస్ పేర్కొన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ బలహీనపడడంతో వైఎస్ఆర్ అభిమానులకు అండగా ఉండాల్సిన అవసరం ఉందన్నారు. షర్మిల రాజకీయ ప్రవేశాన్ని మేం తప్పుపట్టడం లేదన్నారు.
ఇదీ చదవండి:రెండోదశ ఎన్నికల్లో ఏకగ్రీవాలైన పంచాయతీలివే..
TAGGED:
ఏపీ పంచాయతీ ఎన్నికలు న్యూస్