ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'నూతన జిల్లాలతో.. సరికొత్త పాలనకు సీఎం జగన్ శ్రీకారం చుట్టారు' - Dharmana Krishna das on new districts

నూతన జిల్లాల ఏర్పాటుతో సీఎం జగన్.. సరికొత్త పాలనకు శ్రీకారం చుట్టారని ఉపముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ అన్నారు. సీఎం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్​లో సభాపతి తమ్మినేనితో కలిసి పాల్గొన్నారు.

Deputy Chief Minister Dharmana Krishna das
Deputy Chief Minister Dharmana Krishna das

By

Published : Apr 4, 2022, 9:37 PM IST

నూతన జిల్లాల ఏర్పాటుతో రాష్ట్రంలో సరికొత్త పాలనకు సీఎం జగన్ శ్రీకారం చుట్టారని ఉపముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ అన్నారు. సీఎం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో.. శ్రీకాకుళం కలెక్టర్ కార్యాలయం నుంచి సభాపతి తవ్మిునేని సీతారాంతో కలిసి కృష్ణదాస్‌ పాల్గొన్నారు. రాష్ట్రంలో ప్రతిపక్షాలు బాధ్యతగా పనిచేయడం లేదని ఉపముఖ్యమంత్రి మండిపడ్డారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా శాస్త్రీయంగా జరిగిన జిల్లాల విభజనతో.. మంచి ఫలితాలు వస్తాయని సభాపతి తమ్మినేని సీతారాం పేర్కొన్నారు.

'సరికొత్త పాలనకు సీఎం జగన్ శ్రీకారం చుట్టారు'

ABOUT THE AUTHOR

...view details