పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఐసీడీఎస్, వసతిగృహాల అధికారులంతా ఖాళీ గోనె సంచులను సంబంధిత మండల కార్యాలయాల్లో అప్పగించాలని డీఈవో పగడాలమ్మ ఆదేశాలు జారీ చేశారు. శ్రీకాకుళం జిల్లా జేసీ సూచన మేరకే ఆదేశాలు ఇచ్చినట్లు తెలిపారు.
Gunny Bags: ఉపాధ్యాయులూ... గోనె సంచులు అప్పగించండి - ప్రభుత్వ వసతిగృహాల అధికారులు
పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఐసీడీఎస్, వసతిగృహాల అధికారులంతా ఖాళీ గోనె సంచులను సంబంధిత మండల కార్యాలయాల్లో అప్పగించాలని డీఈవో పగడాలమ్మ ఆదేశాలు జారీ చేశారు. శ్రీకాకుళం జిల్లా జేసీ సూచన మేరకే ఆదేశాలు ఇచ్చినట్లు తెలిపారు.
పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకానికి బియ్యం తీసుకున్న తర్వాత ఆ ఖాళీ గోనెసంచుల్ని ప్రధానోపాధ్యాయులు నెలాఖరులో ఎంఈవో కార్యాలయంలో అప్పగించాలని..అటు తర్వాత వాటిని అక్కడి నుంచి ఎంఎల్ఎఎస్ పాయింట్లలో అందించాలంటూ డీఈవో పగడాలమ్మ ఆదేశాలిచ్చారు. ఈ పని చేసిన తర్వాతే వచ్చే నెల సరకులు తీసుకోవాలని అందులో స్పష్టం చేశారు. ఏ నెల ఎంత సరకు తీసుకున్నది.. ఎన్ని సంచులు తిరిగి ఇచ్చిందీ దస్త్రాల్లో నమోదు చేయాలని పేర్కొన్నారు. ప్రస్తుతం ధాన్యం కొనుగోళ్లు ప్రారంభం కానున్నాయని దానికి సరిపడా సంచులు అందుబాటులో లేవని, తయారీ సంస్థలు కొవిడ్ కారణంగా మూతపడ్డాయని, అందుకే ప్రత్యామ్నాయంగా ఇలా సేకరిస్తున్నామని పేర్కొన్నారు. దీనిపై ఉపాధ్యాయ సంఘాలు మండి పడుతున్నాయి.
ఇదీ చదవండి : PROPERTY TAX: కొత్త ఆస్తిపన్నుపై ప్రత్యేక తాఖీదులు