ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

మందరాడలో అక్రమ కట్టడాల కూల్చివేత.. అడ్డుకున్న స్థానికులు - మందరాడలో అక్రమకట్టడాల కూల్చివేత

శ్రీకాకుళం జిల్లా మందరాడ గ్రామంలో చెరువును కబ్జా చేసి కట్టిన అక్రమ కట్టడాలను అధికారులు కూల్చివేయడాన్ని.. స్థానికులు అడ్డుకున్నారు. ఈ కారణంగా.. గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. తమపై కక్షగట్టి ఇళ్లను కూల్చేస్తున్నారని ఆరోపిస్తున్నారు.

demolition of illegal buildings  at mandarada
మందరాడలో ఉద్రిక్తత

By

Published : Dec 13, 2020, 9:56 AM IST

శ్రీకాకుళం జిల్లా సంతకవిటి మండలం మందరాడలో ఉద్రిక్తత నెలకొంది. చెరువు వద్ద ఉన్న అక్రమ కట్టడాలను కూల్చేస్తుండగా.. స్థానికులు అడ్డుకున్నారు. మందరాడ ప్రధాన రహదారి పక్కనే ఉన్న చెరువు వద్ద నిర్మించిన అక్రమ నిర్మాణాలను జిల్లా అధికారుల ఆదేశాల మేరకు.. మండల అధికారులు తొలగింపు పనులు చేపట్టారు.

తహసీల్దార్ గోవిందరావు, ఎస్సై రామారావులతోపాటు జేసీబీతో నిర్మాణాలను తొలగిస్తుండగా.. స్థానికులు అడ్డుకున్నారు. కొంతమేర ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. కావాలనే ఇళ్లను తొలగిస్తున్నారని ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు.

ABOUT THE AUTHOR

...view details