శ్రీకాకుళం జిల్లా వీరఘట్టం మండల ప్రధాన వీధిలో నివాసం ఉంటున్న ఓ మహిళకు అధికారులే ఆప్తులై అంత్యక్రియలు నిర్వహించారు. డోంకాడ పార్వతీ (55) మూడు రోజులు నుంచి తలుపు తీయలేదు. ఆమె అప్పటికే మృతి చెందినట్లు స్థానికులు గుర్తించారు. మృతురాలి కుమార్తె పార్వతీపురంలో నివాసముండగా … ఆమెకు వారు సమాచారం అందించారు. దూరపు బంధువులు, ఇరుగుపోరువారు మృతదేహం వద్దకు రాలేదు. దగ్గరకు వచ్చేందుకు విముఖత చూపారు. ఈ విషయాన్ని వాలంటీర్లు, అధికారులకు తెలిపారు. పంచాయతీ కార్యదర్శి రాజ్ కుమార్ ఆధ్వర్యంలో వాలంటీర్ల సహాయంతో కూతురు.. తల్లి మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించారు. అధికారుల స్పందన పట్ల ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. పార్వతి అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఉండేదని స్థానికులు తెలిపారు.
బంధువులు రాకపోతేనేం.. అధికారులే ఆప్తులయ్యారు - వీరఘట్టంలో మృతదేహానికి అధికారులు అంత్యక్రియలు
ఎవరైనా వ్యక్తి చనిపోతే...అస్సలూ వారోవరో మాకు తెలీదు అన్నట్లే ప్రవర్తిస్తున్నారు. సాధారణ మరణమైనా మృతదేహం దగ్గరికి పోవట్లేదు. అయినవారే దూరంగా ఉంటే ... అధికారులు మాత్రం ఆపన్నహస్తం అందిస్తున్నారు. శ్రీకాకుళం జిల్లా వీరఘట్టంలో ఓ మహిళ చనిపోతే... అధికారులే అన్నీ తామై అంత్యక్రియలు నిర్వహించారు.
మతదేహాన్ని తీసుకెళ్తున్న వాలంటీర్లు