ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కన్నవారి చివరి ఘడియలు.. కూతుళ్లే దిక్కయ్యారు! - daughter did funeral to her mother in nellore dst

లాక్​డౌన్​ కారణంగా ఎక్కడివారక్కడే చిక్కుకుపోయారు. ఇతర రాష్ట్రాల్లో ఉన్న కుమారులు ఆ చివరి ఘడియల్లో చేరుకోలేకపోయారు. 2 వేర్వేరు చోట్ల జరిగిన ఈ ఘటనల్లో... విధిలేని పరిస్థితుల్లో.. వారి కుమార్తెలే తల కొరివి పెట్టారు. కన్నవారి రుణం తీర్చుకుని కన్నీటి పర్యంతమయ్యారు. వేర్వేరు ప్రాంతాల్లో.. వేర్వేరు కుటుంబాలకు చెందిన ఈ ఘటనల వివరాలిలా ఉన్నాయి.

కన్నవారి చివరి ఘడియలు.. కూతుళ్లే దిక్కయ్యారు!
కన్నవారి చివరి ఘడియలు.. కూతుళ్లే దిక్కయ్యారు!

By

Published : Apr 23, 2020, 8:59 PM IST

కన్నవారి చివరి ఘడియలు.. కూతుళ్లే దిక్కయ్యారు!

శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురానికి చెందిన సూర్యనారాయణ.. అనారోగ్యంతో మృతి చెందారు. ఆయన కుమారుడు ధనుంజయ వృత్తిరీత్యా ఇతర ప్రాంతంలో ఉంటున్నాడు. లాక్ డౌన్ కారణంగా.. ఆయన ఇచ్ఛాపురం చేరుకోలేకపోయారు. చివరికి.. సూర్యనారాయణకు ఆయన కుమార్తె ముని.. దహన సంస్కారాలు పూర్తి చేసింది. కన్నతండ్రి రుణాన్ని తీర్చుకుంది.

మరో ఘటనలో...

నెల్లూరు జిల్లా వెంకటగిరి పట్టణానికి చెందిన 50 ఏళ్ల సావిత్రి.. అనారోగ్యంతో మరణించారు. ఆమెకు ఏకైక సంతానంగా ఉన్న వైష్ణవి.. తల్లికి అంతిమ సంస్కారాలు పూర్తి చేసింది. పెద్దల సహాయంతో.. తన మాతృమూర్తికి శాస్త్రోక్తంగా కార్యక్రమాలను నిర్వహించింది.

ఇదీ చూడండి:

కరోనాను ఎదుర్కొనేందుకు 'ఆయుష్' మందు!

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details