ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

శ్రీకాకుళంలో ఘనంగా దసరా వేడుకలు - dasara celebrations in srikakulam

శ్రీకాకుళం జిల్లాలో దసరా ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. విజయదశమి సందర్భంగా అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు బారులుతీరారు.

శ్రీకాకుళంలో ఘనంగా దసరా వేడుకలు

By

Published : Oct 8, 2019, 11:50 PM IST

శ్రీకాకుళంలో ఘనంగా దసరా వేడుకలు
శ్రీకాకుళం జిల్లాలో దసరా ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. శ్రీకాకుళం జిల్లా ఆరాధ్య దైవంగా కొలవబడే పాలకొండ కోటదుర్గమ్మ దర్శనం కోసం భక్తులు తెల్లవారు జామునుంచే వేచి ఉన్నారు. వీరఘట్టం కోటదుర్గమ్మ, కోటబొమ్మాళి కొత్తమ్మతల్లి, పాతపట్నం అమ్మవార్ల దర్శనాలకోసం భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. వాహనాల పూజలతో ఆలయాలు కిక్కిరిసిపోయాయి. ప్రత్యేక పూజల అనంతరం శరన్నవరాత్రి పరిసమాప్తి సందర్భంగా ఘనంగా పూర్ణాహుతి అర్పించారు.

ABOUT THE AUTHOR

...view details