శ్రీకాకుళం జిల్లా టెక్కెలిలోని కోదండరామ వీధికి చెందిన ముద్దాడ లావణ్యకు ఓ అపరిచిత వ్యక్తి ఫోను చేసి ఈకేవైసీ చేయించుకోవాలని, తాను పంపించే లింక్ తెరచి వివరాలు నమోదుచేయాలని సూచించాడు. అది నిజమని నమ్మిన లావణ్య వివరాలను నమోదు చేయగా...కాసేపటికి 5 వేల రూపాయల నగదు ఖాతా నుంచి తీసినట్లు, ఫోన్కు మెసేజ్ వచ్చింది. కొద్ది గంటల్లో మరో రూ.10వేలు స్వాహా చేశాడు.
ఈకేవైసీ అప్డేట్ అన్నాడు... 15వేలు నొక్కేశాడు... - ఈటీవీ భారత్ తెలుగు తాజా వార్తలు
ఈకేవైసీ చేయించుకోకపోతే బ్యాంకు ఖాతా రద్దవుతుందని ఓ అపరిచిత వ్యక్తి ఫోను చేసి ఖాతా నుంచి రూ.15 వేలు స్వాహా చేసిన ఘటన... శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో జరిగింది. అయితే ప్రస్తుతం బాధితురాలు, వారి కుటుంబసభ్యులు పోలీసులను ఆశ్రయించారు.

ఈకేవైసీ పేరుతో నగదు స్వాహా
మొదటిసారి నగదు తీసుకున్న సమయంలో సంబంధిత వ్యక్తి కి ఫోన్ లో సంప్రదిస్తే ఆందోళన చెందొద్దని, 24 గంటల్లో నగదు తిరిగి ఖాతాలో జమ అవుతుందని నమ్మించాడని బాధితురాలు వాపోయింది. ప్రస్తుతం తమకు జరిగిన మోసంపై బాధిత కుటుంబసభ్యులు పోలీసులను ఆశ్రయించారు.
ఇవీ చూడండి