శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పు గోదావరి జిల్లాల్లో ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన సహా.. ఇతర పథకాల ద్వారా మంజూరు చేసిన రోడ్లు, వంతెనలకు సంబంధించి పెండింగ్‌లో ఉన్న అటవీ క్లియరెన్సుల కోసం చర్యలు చేపట్టాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మ కలెక్టర్లను ఆదేశించారు.
CS SAMEER SHARMA: ఆ పని త్వరగా ముగించండి.. కలెక్టర్లకు సీఎస్ ఆదేశం
పెండింగ్‌లో ఉన్న అటవీ అనుమతుల విషయమై.. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్లతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
కలెక్టర్లతో సీఎస్ సమీర్ శర్మ వీడియో కాన్ఫరెన్స్
పెండింగ్ అటవీ క్లియరెన్సులు, జలజీవన్ మిషన్, గ్రామ ఆరోగ్య కేంద్రాలు, గ్రామీణ పారిశుధ్యం వంటి అంశాలపై ఆయన జిల్లా కలెక్టర్లతో సమీక్ష నిర్వహించారు. అటవీశాఖ అధికారులు కూడా దీనిపై క్షేత్రస్థాయిలో తరచూ సమీక్షించుకుని, అటవీ అనుమతులు సాధించేలా చర్యలు చేపట్టాలని సూచించారు.
ఇదీ చూడండి:PADAYATRA: అమరావతి రైతుల మహా పాదయాత్రకు నేడు విరామం.. కారణమేంటంటే..?