శ్రీకాకుళం జిల్లా సరుబుజ్జిలి మండలం పెద్దసమలపురం గ్రామ సమీపంలో వంశధార నది సమీపంలో ఉన్న 15 ఎకరాల జీడి మామిడి తోట దగ్దమైంది. గుర్తు తెలియని వ్యక్తులు నది ఒడ్డున వరిగడ్డి కాల్చడంతో ఈ ప్రమాదం సంభవించిందని రైతులు చెబుతున్నారు. 15 మంది రైతులకు చెందిన తోటలు పూర్తిగా కాలిపోగా.. సుమారు రూ.10 లక్షల వరకు ఆస్తి నష్టం వాటిల్లిందని అన్నదాతలు ఆవేదన చెందుతున్నారు. ఈ ఏడాది తోట పంట బాగుందని తీరా కాపుకొచ్చే సమయంలో అగ్ని ప్రమాదం జరిగిందని రైతులు వాపోతున్నారు. ప్రభుత్వమే స్పందించి తమను ఆదుకోవాలని కర్షకులు కోరుతున్నారు.
పెద్దసమలపురం సమీపంలో జీడిమామిడి తోటలు దగ్ధం - జీడిమామిడి తోటలు దగ్దం సరుబుజ్జిలి
శ్రీకాకుళం జిల్లా పెద్దసమలపురం సమీపంలో 15 ఎకరాల జీడి మామిడి తోటలు దగ్ధమయ్యాయి. గుర్తు తెలియని వ్యక్తులు వంశధార నది సమీపంలో వరి గడ్డి కాల్చడంతో ఈ ప్రమాదం జరిగింది.
![పెద్దసమలపురం సమీపంలో జీడిమామిడి తోటలు దగ్ధం crop burn](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-10404168-813-10404168-1611764971122.jpg)
పెద్దసమలపురం సమీపంలో జీడిమామిడి తోటలు దగ్ధం