కరోనాతో మృతి చెందిన మహిళకు సర్పంచ్ దగ్గరుండి అంత్యక్రియలు నిర్వహించారు. శ్రీకాకుళం జిల్లా పాలకొండ మండలం, లుంబూరులో పులి జయమ్మ(49) కరోనా మృతి చెందింది. అత్యక్రియలు నిర్వహించడానికి బంధువులు ఎవరూ ముందుకు రాలేదు. గ్రామ సర్పంచ్ తిర్లంగి ఉపేంద్ర కుమార్ కుటుంబ సభ్యులకు అవగాహన కల్పించి అంత్యక్రియలు నిర్వహించారు. ఎమ్మార్వో సోమేశ్వరరావు స్పందించి 6 పీపీఈ కిట్లు పంపించారు.
సర్పంచ్ ఆధ్వర్యంలో కరోనా మృతురాలికి అంత్యక్రియలు - శ్రీకాకుళం జిల్లాలో కరోనా అంత్యక్రియలు
శ్రీకాకుళం జిల్లా పాలకొండ మండలం లుంబూరులో కరోనా మృతురాలికి సర్పంచ్ ఉపేంద్ర దగ్గరుండి అంత్యక్రియలు నిర్వహించారు. అంత్యక్రియలు చేయడానికి ఎవ్వరూ ముందుకు రాకపోవటంతో మృతురాలి కుటుంబ సభ్యులకు అవగాహన కల్పించారు.

corona cases at srikakulam district