శ్రీకాకుళం జిల్లా పాలకొండ మండలం గొట్ట మంగలాపురం సచివాలయం వద్ద సీపీఎం ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. ఈ నెల 20 నుంచి 26 వరకు దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం... కార్మిక, రైతాంగ, ప్రజా వ్యతిరేక విధానాలపై అవలంబిస్తున్న తీరును వ్యతిరేకిస్తూ చేపట్టిన ఆందోళనలో భాగంగా ప్రదర్శన చేశారు. కరోనా సమయంలో ప్రతి పేద కుటుంబానికి ఆరు నెలకు రూ. 7,500 నగదు ఇవ్వాలని, ప్రతి ఒక్కరికి 10 కేజీల బియ్యం ఉచితంగా పంపిణీ చేయాలని కోరింది. కరోనా నుంచి ప్రజారోగ్య వ్యవస్థను బలపరచాలని డిమాండ్ చేసింది.
'ప్రతి పేద కుటుంబాన్ని కేంద్రం ఆర్థికంగా ఆదుకోవాలి' - gotta mandalapuram sachivalayam latest news
గొట్ట మంగలాపురం సచివాలయం వద్ద సీపీఎం నాయకులు ఆందోళన చేశారు. దేశవ్యాప్తంగా ఉన్న కార్మిక, రైతాంగం విషయంలో కేంద్రం తీరును నిరసిస్తూ ధర్నాకు దిగారు.
ప్రజా సమస్యల పరిస్కారానికి సీపీఎం ఆందోళన