ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'వలస కూలీలకు నిలిపేసిన రేషన్​ను పునరుద్ధరించాలి' - సీపీఎం నేత సీహెచ్ బాబూరావు తాజా వార్తలు

వలస కూలీలను ఆదుకుంటామన్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వారికి రేషన్ కోత విధించటం అమానుషమని సీపీఎం నేత సీహెచ్ బాబూరావు వ్యాఖ్యానించారు. శ్రీకాకుళం జిల్లా నుంచి వలస వచ్చి ఇతర జిల్లాలలో నివసిస్తున్న పేదలకు నిలిపేసిన రేషన్​ను పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు.

'వలస కూలీలకు నిలిపేసిన రేషన్​ను పునరుద్ధరించాలి'
'వలస కూలీలకు నిలిపేసిన రేషన్​ను పునరుద్ధరించాలి'

By

Published : Nov 13, 2020, 4:25 PM IST

శ్రీకాకుళం జిల్లా నుంచి వలస వచ్చి ఇతర జిల్లాలలో నివసిస్తున్న పేదలకు నిలిపేసిన రేషన్​ను పునరుద్ధరించాలని సీపీఎం నేత సీహెచ్ బాబూరావు డిమాండ్ చేశారు. విజయవాడ, కృష్ణాతో పాటు ఇతర జిల్లాల్లో శ్రీకాకుళం వలస కార్మికులు పెద్ద సంఖ్యలో నివసిస్తున్నారనే విషయం ప్రభుత్వానికి తెలుసునన్నారు. ఈ విషయంపై పౌర సరఫరాల శాఖ మంత్రి దృష్టి పెట్టి తక్షణమే రేషన్ పునరుద్ధరించాలని కోరారు.

ABOUT THE AUTHOR

...view details