'ప్రజల కోసం నిరంతరం పోరాడుతున్న దళిత హక్కుల పోరాట సమితి నాయకులపై హత్యాయత్నం చేయడం దురదృష్టకరం' అని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి సనపల నర్సింహులు అన్నారు. ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ, బలహీన వర్గాలకు ఇచ్చిన భూములను, ఇళ్ల స్థలాల పేరుతో తిరిగి తీసుకోవడం సరైంది కాదని అన్నారు.
ప్రభుత్వం చెల్లిస్తున్న భూమి విలువ పరిహారాన్ని... కొందరు అధికార పార్టీ నాయకులు పక్క దారికి మళ్లించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. ఈ విషయంపై ఆర్టీఐ యాక్ట్ ద్వారా వివరాలు సేకరించిన గోపీ, మోహన్ రావు అనే నేతలపై దుండగులు హత్యాయత్నం చేశారన్నారు. వారిని గుర్తించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని నర్సింహులు డిమాండ్ చేశారు.