అగ్రిగోల్డ్ కస్టమర్స్ అండ్ ఏజెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సీపీఐ నాయకులు 48 గంటల దీక్షను శ్రీకాకుళం దాసరి క్రాంతి భవన్‌లో ప్రారంభించారు. కార్పోరేట్లకు లక్షల కోట్ల రుణమాఫీ చేస్తున్న ప్రభుత్వం.. పేద, మధ్య తరగతి ప్రజలు దాచుకున్న సొమ్మును వెనక్కు ఇవ్వడానికి మీనమేషాలు లెక్కిస్తుందని సీపీఐ జిల్లా కార్యదర్శి నర్సింహులు విమర్శించారు. జగన్మోహన్‌రెడ్డి పాదయాత్రలో ఇచ్చిన హామీని నిలబెట్టుకొని.. అగ్రిగోల్డ్ డిపాజిట్లు చెల్లించాలని కోరారు
సీపీఐ ఆధ్వర్యంలో 48 గంటల దీక్ష - agri gold victims news in srikakulam dst
అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం జరగాలనీ... శ్రీకాకుళం జిల్లా దాసరి క్రాంతి భవన్ లో సీపీఐ నాయకులు 48 గంటల దీక్షను ప్రారంభించారు. ఖాతాదారులందరికీ డబ్బులు చెల్లించి పాదయాత్రలో ఇచ్చిన హామి నిలబెట్టుకోవాలని సీపీఐ జిల్లా కార్యదర్శి నర్సింహులు డిమాండ్ చేశారు.
cpi protest in srikakulam dst about agrigold victims