విజయనగరం జిల్లా శుక్రవారం రాత్రి ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. పలుచోట్ల చెట్లు, విద్యుత్ స్తంభాలు విరిగిపడ్డాయి. కురుపాం నియోజకవర్గం గరుగుబిల్లి మండలం రావివలస గ్రామంలో పశువులశాలపై చెట్టుపడి ఆవుదూడ మృత్యువాత పడింది. గ్రామంలోని నాగిరెడ్డి పారి నాయుడుకు చెందిన దూడ మృతి చెందగా అవుకు తీవ్ర గాయాలయ్యాయి. ఉరుములు, మెరుపులతో గాలుల ఉద్ధృతికి కురుపాం నియోజకవర్గంలో పలు గ్రామాల్లో చెట్టు కొమ్మలు, ఇంటి పైకప్పులు ఎగిరిపడ్డాయి. పలు ప్రాంతాల్లో అధికంగా విద్యుత్ స్తంభాలు, అరటి తోటలు నేలకొరిగాయి.
విజయనగరంలో భారీ వర్షం.. చెట్టు విరిగిపడి ఆవుదూడ మృతి - విజయనగరం జిల్లాలో భారీ వర్షం వార్తలు
విజయనగరం జిల్లాలో ఈదురు గాలులతో కురిసిన భారీ వర్షం కారణంగా చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. రావివలస గ్రామంలో పశువుల శాలపై చెట్టు పడి ఆవుకు తీవ్ర గాయాలు కాగా, దూడ మృతి చెందింది.
![విజయనగరంలో భారీ వర్షం.. చెట్టు విరిగిపడి ఆవుదూడ మృతి cow dead by heavy rain at vizainagaram](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7024130-354-7024130-1588391781517.jpg)
పశువులశాలపై చెట్టుపడి దూడ మృతి
ఇవీ చూడండి...