శ్రీకాకుళం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో కొవిడ్ విధులు నిర్వహిస్తున్న సిబ్బంది.. తమకు జీతాలు ఇవ్వడం లేదని అవేదన వ్యక్తం చేశారు. జీజీహెచ్ కొవిడ్ విభాగం వద్ద పీపీఈ కిట్లు ధరించి శుక్రవారం నిరసన చేశారు. కొవిడ్ క్లిష్ట సమయంలో విధులు నిర్వహించినా... 4 నెలలుగా జీతాలు ఇవ్వడంలేదని వాపోయారు. ఇంటి ఖర్చులకు అప్పులు చేశామన్న ఉద్యోగులు.. ఇప్పటికైనా జీతాలు ఇవ్వాలని కోరారు. పర్మినెంట్ ఉద్యోగులుగా గుర్తిస్తామని హామీ ఇచ్చినందుకే.. బయట చేస్తున్న ఉద్యోగాలను విడిచిపెట్టి.. ఇక్కడ చేరామని చెప్పారు. తమకు న్యాయం చేయాలని వేడుకున్నారు.
పీపీఈ కిట్లతో జీజీహెచ్ సిబ్బంది నిరసన - ఏపీ తాజా వార్తలు
శ్రీకాకుళం జీజీహెచ్ సిబ్బంది నిరసనకు దిగారు. కొవిడ్ సమయంలో విధులు నిర్వహించిన తమకు నాలుగు నెలలుగా జీతాలు ఇవ్వడం లేదని ఆవేదన చెందారు. ఇంటి ఖర్చులకు అప్పులు చేస్తున్నామని, ఇప్పటికైనా జీతాలు ఇవ్వాలని కోరారు.
Covid warriors