శ్రీకాకుళం జిల్లాలోని రాజాంలో అమానవీయ ఘటన జరిగింది. డబ్బులు ఉన్నప్పటికీ అవి వాడుకునే పరిస్థితి లేకపోవడంతో కరోనా బాధితురాలు నడిరోడ్డుపై కన్నుమూసింది.
నగదు ఇస్తేనే చేర్చుకుంటాం..
శ్రీకాకుళం జిల్లాలోని రాజాంలో అమానవీయ ఘటన జరిగింది. డబ్బులు ఉన్నప్పటికీ అవి వాడుకునే పరిస్థితి లేకపోవడంతో కరోనా బాధితురాలు నడిరోడ్డుపై కన్నుమూసింది.
నగదు ఇస్తేనే చేర్చుకుంటాం..
కరోనా సోకిన అంజలి అనే మహిళను జిల్లాలోని జీఎంఆర్ వరలక్ష్మి కేర్ ఆస్పత్రికి బంధువులు తీసుకువచ్చారు. అయితే నగదు చెల్లిస్తేనే ఆడ్మిట్ చేసుకుంటామని ఆసుపత్రి యాజమాన్యం స్పష్టం చేసింది. ఫోన్ పే, గూగుల్ పే లాంటి ఆన్‌లైన్ పేమెంట్‌ను కూడా ఆస్పత్రి సిబ్బంది నిరాకరించారు. దీంతో చేసేదేమీ లేక డబ్బు కోసం బాధితురాలి బంధువులు ఏటీఎంల చుట్టూ 3 గంటలు తిరిగారు. ఈలోగా ఊపిరి ఆడక బాధితురాలు నడిరోడ్డుపై ప్రాణాలు విడిచింది. కేర్ ఆస్పత్రి సిబ్బంది వైఖరి పట్ల మృతురాలి బంధువులు, స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. డిజిటల్ ఇండియాలో భాగంగా ఆన్‌లైన్ పేమెంట్స్ ఎక్కువగా జరుగుతున్న ఈ కాలంలో ఇంకా క్యాష్ ట్రాన్సాక్షన్స్ మాత్రమే అంటూ ప్రజల ప్రాణాలు తీయడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు.
ఇదీ చదవండి: 'అక్రమ మైనింగ్‌పై కఠిన చర్యలు తీసుకోండి'