శ్రీకాకుళంలో కలెక్టర్ కార్యాలయం వద్ద కొవిడ్ వైద్య సిబ్బంది ధర్నా నిర్వహించారు. జీతాలు చెల్లించాలంటూ ఆందోళన చేశారు. మహమ్మారి సమయంలో సేవలందించిన వారికి నాలుగు నెలలుగా వేతనాలు ఇవ్వటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తమను శాశ్వత ఉద్యోగులుగా నియమించాలని డిమాండ్ చేశారు. ఇంటి ఖర్చులకు అప్పులు చేశామని...ఇప్పటికైనా జీతాలు చెల్లించాలని కోరారు.
కలెక్టర్ కార్యాలయం ఎదుట కొవిడ్ వైద్య సిబ్బంది ధర్నా - protest in front of collectarate news
శ్రీకాకుళం జిల్లాలో కొవిడ్ విధులు నిర్వహిస్తున్న సిబ్బందికి వేతనాలు చెల్లించాలంటూ ధర్నా నిర్వహించారు. కలెక్టర్ కార్యాలయం వద్ద నినాదాలు చేస్తూ ఆందోళన చేపట్టారు.
కొవిడ్ వైద్య సిబ్బంది ధర్నా