ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

20 మంది టీచర్లకు కరోనా.. వైరస్​ ప్రభావంతో తెలుగు ఉపాధ్యాయుడు మృతి - ప్రభుత్వ ఉపాధ్యాయులకు కరోనా తాజా వార్తలు

శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలోని పలు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలకు చెందిన 20 మంది ఉపాధ్యాయులు వైరస్ బారిన పడ్డారు. మడపాం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల తెలుగు ఉపాధ్యాయుడు బలివాడ వాసుదేవరావు ఇవాళ వైరస్ కారణంగా కన్నుమూశారు.

covid for government teachers  in Narasannapeta
నరసన్నపేటలో 20 మంది ప్రభుత్వ ఉపాధ్యాయులకు కరోనా

By

Published : Apr 24, 2021, 10:26 PM IST

శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో ప్రభుత్వ ఉపాధ్యాయులపై కరోనా వైరస్ పంజా విసిరింది. మండలంలోని పలు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలకు చెందిన 20 మంది ఉపాధ్యాయులు వైరస్ బారిన పడ్డారు. మరో 13 మంది విద్యార్థులకూ కొవిడ్ సోకింది.

మడపాం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల తెలుగు ఉపాధ్యాయుడు బలివాడ వాసుదేవరావు ఇవాళ వైరస్ కారణంగా కన్నుమూశారు. ఇదే పాఠశాల నుంచి మరో ఐదుగురు ఉపాధ్యాయులు సైతం కరోనా బారినపడ్డారు.

ABOUT THE AUTHOR

...view details