శ్రీకాకుళం జిల్లా ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి కొవిడ్ విభాగం.. కొవిడ్ ట్రైఏజ్ ఏరియాలో మంచంపై ఓ మహిళ పడుకున్నట్లే ఉంది. ఆ ఎదురుగానే పీపీఈ కిట్లు ధరించి వైద్య సిబ్బంది కొవిడ్ పరీక్షలు నమోదు వివరాలు సేకరిస్తున్నారు. మంచం మీద ఉన్న మహిళ మరణించినట్లు గమనించిన ఈనాడు ఫొటో గ్రాఫర్ ఆ దృష్ట్యాలను ఫొటోలు తీశారు. దీంతో సిబ్బంది ఉలిక్కిపడ్డారు. అప్రమత్తమై కొవిడ్ నిబంధనలకు అనుగుణంగా మృతిరాలికి ప్రత్యేక సూట్ వేసి శవాగారానికి తరలించారు. ఈ విషయం తమ దృష్టికి రాలేదని చీఫ్ కొవిడ్ నోడల్ ఆఫీసర్ డాక్టర్ ప్రభాకర్ అన్నారు. ఆమె ఎవరన్న వివరాలు తెలియాల్సి ఉంది.
కొవిడ్ ఆస్పత్రి ఆవరణలోనే మహిళ మృతి.. ఒక్క క్లిక్‌తో స్పందించిన సిబ్బంది - కొవిడ్ ఆస్పత్రి ఆవరణలోనే మహిళ మృతదేహం
కొవిడ్ విజృంభిస్తోంది. పెద్ద సంఖ్యలో కేసులు రావడం.. కొన్ని కొవిడ్ ఆస్పత్రుల్లో కరోనా రోగులను పట్టించుకోవడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇది నిజమేనని నిరూపించే సంఘటన శ్రీకాకళం జిల్లా ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి ఆవరణలో జరిగింది. మహిళ మంచంపై మరణించి ఉన్నా.. సిబ్బంది పట్టించుకోకుండా తమ పని తాము చూసుకుంటున్న దృష్ట్యాలు కళ్లకు కట్టినట్లు కనిపించాయి.
covid death