ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

దంపతుల ఆత్మహత్యాయత్నం.. కుటుంబ కలహాలే కారణమా? - gotta village news

శ్రీకాకుళం జిల్లాలో గొట్ట గ్రామానికి చెందిన దంపతులు.. ఆత్మహత్యాయత్నం చేశారు. కుటుంబ కలహాలే కారణమని స్థానికులు తెలిపారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

couple commits suicide
శ్రీకాకుళం జిల్లాలో ఓ దంపతులు ఆత్మహత్యయత్నం

By

Published : Jan 6, 2021, 8:36 AM IST

శ్రీకాకుళం జిల్లా హిరమండలం మండలం గొట్ట గ్రామానికి చెందిన కొత్తపల్లి ఆనందరావు, జయలక్ష్మి దంపతులు ఆత్మహత్యాయత్నం చేశారు. మంగళవారం పాతపట్నం వచ్చిన ఇద్దరు.. రైల్వే నిలయం సమీపంలో పురుగుల మందు తాగినట్టు స్థానికులు గుర్తించారు. వెంటనే పాతపట్నం సామాజిక ఆసుపత్రికి తరలించారు.

ప్రాథమిక వైద్య పరీక్షలు చేసిన వైద్యులు.. మెరుగైన వైద్యానికి శ్రీకాకుళం పంపించారు. తమ కుమార్తెను బలవంతంగా పురుగుల మందు తాగించాడని ఆనందరావుపై.. జయలక్ష్మి తండ్రి భీముడు హిరమండలం పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఘటనకు కుటుంబ కలహాలే కారణమని స్థానికులు చెప్పారు.

ABOUT THE AUTHOR

...view details